ETV Bharat / city

సొంతూళ్లకు వెళ్తామంటూ.. వలస కూలీల నిరసనలు - Migrant worker protests in ap

వాళ్లంతా పొట్ట చేతపట్టుకుని పనుల కోసం సొంతూరు వదిలి సుదూర ప్రాంతాలకు వలస వచ్చిన కార్మికులు. రెక్కాడితే గానీ డొక్కాడని శ్రామికులు. కరోనా విజృంభణ అనంతరం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 41 రోజులుగా వారికి ఉపాధి లేదు.. నోట్లోకి నాలుగువేళ్లు వెళ్లే మార్గం కనిపించలేదు. సొంతూళ్లకు పంపేస్తామంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితం కావడంతో కడుపు మండి.. తిరగబడ్డారు. వారిని నిలువరించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాల్లో సోమవారం ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.

Migrant worker protests in ap
సొంతూళ్లకు వెళ్తామంటూ వలస కూలీల నిరసనలు
author img

By

Published : May 5, 2020, 8:18 AM IST

వలసకూలీల ఊరిబాట ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని దండకుండ ఇసుక ర్యాంపులో పనుల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది కార్మికులు ఎప్పుడో వచ్చారు. తమ ప్రాంతాలకు వెళ్లిపోతామంటూ వారంతా సోమవారం గోదావరి తల్లి విగ్రహం వద్దకు వచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఈలోపు కొందరు రోడ్‌కం రైలు వంతెన మీదుగా వెళ్లే ప్రయత్నం చేయగా వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో కొందరు కార్మికులు పోలీసులపైకి రాళ్లు, ఖాళీ మద్యం సీసాలు విసరడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రోజుల్లో కార్మికులను స్వరాష్ట్రాలకు పంపుతామని డీఎస్పీ రాజేశ్వరరెడ్డి చెప్పడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. లాఠీఛార్జిలో 10 మంది కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల్లో ఒక సీఐకి నడుము, కాలిపై గాయమైంది. మరో ఎస్సైకి చిన్నపాటి గాయమైంది. కార్మికులు విసిరిన రాయి తణుకు సీఐ చైతన్యకృష్ణకు తగిలింది. ఆయన గతంలోనే స్టంట్‌ వేయించుకుని ఉండటంతో ఆందోళన కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పోలవరం ప్రాజెక్టులో పనిచేసేందుకు వచ్చిన కూలీల్లో కొందరు స్వగ్రామాలకు వెళ్లిపోతామంటూ ఒత్తిడి తెచ్చారు. సోమవారం తెల్లవారుజామున 500 మంది వలస కూలీలు ఎగువ కాఫర్‌డ్యామ్‌ మీదుగా తూర్పుగోదావరి జిల్లా వైపు చేరుకోవడంతో అక్కడి పోలీసులు వారిని నిలువరించారు. వీళ్లంతా ఝార్ఖండ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందినవారు. వీరిని దేవీపట్నం మండలంలోని ఫజుల్లాబాద్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోసారి రంపచోడవరం గుండా వెళుతుండగా ఫోక్సుపేట చెక్‌పోస్టు వద్ద అడ్డుకోవడంతో పోలీసులకు, కూలీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య అక్కడికి చేరుకుని వారిని బస్సుల్లో రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

తిరుపతిలో పలు రాష్ట్రాలకు చెందిన 200 మంది వలస కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. పేర్లు నమోదు చేయించుకోడానికి వారు ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకోగా అక్కడ తలుపులు మూసేయడంతో వారు నిర¢సనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

రద్దీగా రాష్ట్ర సరిహద్దు

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌ వలస కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రజల తిరుగు ప్రయాణంతో గరికపాడు వద్ద జాతీయరహదారిపై రాష్ట్ర సరిహద్దు సోమవారం రద్దీగా మారింది. వచ్చేవారిని నియంత్రించడానికి పోలీసు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తెలంగాణ డీజీపీ నుంచి అనుమతిపత్రాలు ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతించారు. అవి లేనివారిని వెనక్కి పంపేశారు. వచ్చిన వాహనాలను పార్కింగ్‌ స్థలంలో ఉంచి, అనుమతి పరిశీలన అనంతరం పాస్‌ ఇచ్చి రాష్ట్రంలోకి పంపారు.

ఆహారం ముట్టకుండా నిరసన

కృష్ణాజిల్లాలో 4వేల మంది వలస కూలీలున్నారు. వారంతా ఆదివారం రోడ్డెక్కారు. మహారాష్ట్రకు చెందిన 1,200 మందిని తొలివిడతగా సోమవారం సాయంత్రం 48 బస్సుల్లో రాయనపాడు తరలించి, అక్కడినుంచి ప్రత్యేక రైలులో పంపారు. కొండపల్లి గిరిజన పాఠశాలలో ఉన్న 80 మంది బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలవారు తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని సోమవారం ఆందోళన చేశారు. తహసీˆల్దార్‌ పంపిన అల్పాహారం, దాతలు తీసుకొచ్చిన మధ్యాహ్న భోజనం తీసుకోకుండా నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో 22,682 మంది, పునరావాస కేంద్రాల్లో 2,807 మంది వలస కార్మికులున్నారు. వారిలో రాజస్థాన్‌కు చెందినవారే 12 వేల మంది ఉన్నారు. వారందరికీ ర్యాండమ్‌గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. తమను వెంటనే పంపించాలని వలస కూలీలు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కర్ణాటక నుంచి వచ్చిన కూలీలు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఇరుక్కుపోయారు. వారూ ఆందోళనకు దిగారు.

ఇవీ చదవండి...ఉపాధి దొరకనివారే రాష్ట్రానికి తిరిగి రండి: సీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.