మేకపాటి గౌతమ్‌రెడ్డి లేరని ఊహించడమే కష్టంగా ఉందని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం.. పార్టీకి, తనకు, రాష్ట్రానికి లోటన్నారు. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం పాల్గొన్నారు. గౌతమ్ తనకు చిన్నతనం నుంచి స్నేహితుడని..., వయస్సులో తనకన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా అన్న అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఒక మంచి స్నేహితుడిని, నాయకుడిని పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్‌తో విభేదించి బయటికి వచ్చినప్పుడు గౌతమ్ తనతో నిలబడ్డారని... ఆయన తండ్రిని కూడా తనతో నడిపించారని అన్నారు. మంత్రిగా 6 శాఖలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. దుబాయ్ ఎక్స్‌పోకు వెళ్లే ముందు తనను కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోవడానికి కృషి చేశారన్నారు. సంగం ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్‌రెడ్డిపేరు పెడతామని సీఎం అసెంబ్లీలో ప్రకటించినట్లు పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇదీ చదవండి : CM Jagan: మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్