ETV Bharat / city

CABINET MEETING : నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ - state cabinet today

రాష్ట్ర సచివాలయంలో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో  ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది.

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ
author img

By

Published : Oct 28, 2021, 5:19 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. దేవాదాయ స్థలాల లీజు గడువు, ఖాళీ చేయించే విషయంలో చట్టసవరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్‌’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై చర్చించనున్నారు. కడప జిల్లాలో ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపుల అంశం ప్రస్తావనకు రానుంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో వైకాపా కార్యాలయానికి ఒకటిన్నర ఎకరాను కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కర్నూలులోని ప్రముఖ సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాలకు రూరల్‌ మండలం దిన్నెదేవరపాడులో 50 ఎకరాలు కేటాయించనున్నారు. యూజీ విద్యార్థులకు వసతిగృహం, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏడు కిలోమీటర్ల దూరంలో భూములు ఇవ్వనున్నారు.

ఎనిమిది ప్రధాన ఆలయాల్లోనూ ప్రత్యేక ఆహ్వానితులు?

రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. సింహాచలం, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకాతిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు ఆలయాల పాలకవర్గాల్లో అదనంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించనుంది. దేవాదాయ ట్రైబ్యునల్‌కు అధికారులు కల్పించేలా చట్టసవరణ చేయనుంది.

* పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్‌ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాలు

విశాఖలోని శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో సర్వే నంబరు-102లో ఉన్న భూమిని ఇవ్వబోతుంది. పీఠం కార్యకలాపాల విస్తరణకు ఈ భూములను కేటాయిస్తున్నారు. అక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంది. దీనిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఎజెండాలో మొదటి అంశం కింద దీనిని చేర్చారు. సీఎం కార్యాలయం నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు కేవలం రెండే వారాల్లో విశాఖ జిల్లా అధికారులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములు పరిశీలించడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, ఎంపిక చేయడం చకాచకా జరిగింది. దీనికి సంబంధించిన చర్చల్లో దేవాదాయశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.