ETV Bharat / city

AP PHC: ప్రాథమిక వైద్యానికి సర్దుబాటు గండం - ఏపీ తాజా వార్తలు

AP PHC: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది కుదింపు చర్యలు ఆందోళనలకు దారితీస్తున్నాయి. పీహెచ్‌సీల్లో సిబ్బంది సంఖ్య 21 నుంచి 12కు కుదించే యత్నాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రోగులకు చికిత్స, జాతీయ కార్యక్రమాల పర్యవేక్షణపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఆరోగ్యసేవల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.

AP PHC
పీహెచ్‌సీల్లో సిబ్బంది కుదింపు
author img

By

Published : Jul 29, 2022, 8:15 AM IST

AP PHC: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది కుదింపు చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కొలువులో ఉన్నవారికి నష్టాన్ని చేకూరుస్తుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో ఉద్యోగులను కుదించే ప్రయత్నాలపై ఇప్పటికే వైద్యులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని కుదించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనా ఉద్యోగుల్లో ఆందోళన మొదలయింది.

రాష్ట్రంలో 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా మరో 176 రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల సర్దుబాటుకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో కలిపి సుమారు 25 వేల మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఒక పీహెచ్‌సీ కేంద్రంగా 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 12కి తగ్గించి, మిగిలినవారిని ఇతర ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయబోతున్నారు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లాలో ఇలాగే ఉద్యోగులను కుదించారు. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఆ ప్రయత్నాలను అప్పట్లో విరమించుకున్నారు. ఇంచుమించు అదేవిధంగా మళ్లీ సర్దుబాటు చర్యలు మొదలుపెట్టడం వివాదాస్పదమవుతోంది.

జనాభా, వైద్యసేవల ప్రాతిపదికన కాకుండా.. అశాస్త్రీయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆస్కారరావు మండిపడ్డారు. మహిళలకు సంబంధించిన సేవలను పురుష సిబ్బందితో చేయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీహెచ్‌ఎస్‌ మేల్‌ పోస్టును తొలగించడంతో పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నివారణ చర్యలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. అయిదు వేల జనాభా యూనిట్‌ కింద నెలకు 12 మంది గర్భిణులను గుర్తించి సేవలందించాల్సి ఉంది. 20 వేల జనాభా ఉంటే 48 మంది గర్భిణులకు కొత్త కేడర్‌ ప్రకారం సేవలు అందించాలంటే కష్టమైపోతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇంతకంటే జనాభా ఎక్కువగా ఉంటే ఉద్యోగులపై మరింత పనిభారం పెరుగుతుంది.

మరోవైపు పీహెచ్‌సీ వైద్యుల్లో ఒకరికి ప్రతిరోజూ 104 సేవల ద్వారా క్షేత్రస్థాయి విధులు కేటాయించనున్నందున జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ కుంటుపడుతుందని సంఘం నేతలు పేర్కొంటున్నారు. గతేడాది ఇచ్చిన జీవో అమలును పక్కనపెట్టిన అధికారులు మళ్లీ చర్యలకు ఉపక్రమిస్తుండడంపై వారు మండిపడుతున్నారు.

పోస్టుల గల్లంతు ఇలా..!
* ఒక్కో పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఈవో (మల్టీపర్పస్‌ హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌), హెల్త్‌ ఎడ్యుకేటర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో), పబ్లిక్‌ హెల్త్‌ నర్సు, డిప్యూటీ పారా మెడికల్‌ ఆఫీసర్‌ ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి. ఈ అయిదు పోస్టుల్లో ఒకటి కొనసాగిస్తూ మిగిలిన నాలుగింటిని సర్దుబాటు నిమిత్తం రిజర్వులో పెట్టారు.

* లోయర్‌ డివిజన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఒకదాన్ని కొనసాగిస్తూ రెండు పోస్టులను పక్కనపెట్టారు.

* మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ (ఎంపీహెచ్‌ఎస్‌) ఫిమేల్‌ పోస్టును కొనసాగిస్తూ మేల్‌ సూపర్‌వైజర్‌ పోస్టును రిజర్వులో ఉంచారు.

* మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌, ఫిమేల్‌ పోస్టులు ఉండగా రెండింటిని తీసేశారు. ఇలా పోస్టుల తొలగింపు ద్వారా పీహెచ్‌సీల్లో 12 మంది మాత్రమే మిగులుతారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (వైద్యులు)3, స్టాఫ్‌నర్సులు 3, ఒక్కోటి చొప్పున ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌వో, ఎంపీహెచ్‌ఎస్‌ (ఫిమేల్‌), శానిటరీ- అటెండర్‌- వాచ్‌మెన్‌ పోస్టులను కొనసాగిస్తామని జీవో 143లో ప్రభుత్వం పేర్కొంది.

సిబ్బంది కుదింపు చర్యలు మానుకోకుంటే ఆందోళనలు: ఉద్యోగుల సంఘం హెచ్చరిక

వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించే సిబ్బందిని తగ్గించే చర్యలు ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సిబ్బందికి చేటు తెచ్చే ప్రయత్నాలను విరమించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. శాఖాపరంగా హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలంటే ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. విజయవాడలో గురువారం సంఘం అధ్యక్షుడు ఆస్కారరావు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలను సంఘం విడుదల చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.