ETV Bharat / city

తెలంగాణ: మేడారంలో సమ్మక్క-సారక్క గద్దెలు మూసివేత

రేపటి నుంచి 21 రోజుల పాటు మేడారం సమ్మక్క-సారక్క గద్దెలను మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ: మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత

author img

By

Published : Feb 28, 2021, 8:44 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారక్క గుద్దెలను రేపటి నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడారం మిని జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కొవిడ్​ సోకింది. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె.జండగె ఆదేశాల మేరకు సోమవారం నుంచి 21 రోజుల వరకు గద్దె తలుపులు మూసి వేస్తున్నట్లు అధికారికంగా దేవాదాయ శాఖ అధికారి రాజేశ్వరరావు, పూజారి పెద్ద సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. ఈ నెల 24న ప్రారంభమైన చిన జాతర 27న ముగిసింది.

ఇదీ చదవండి: రేపటి నుంచి చంద్రబాబు పురపాలక ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.