మావోయిస్టు కేంద్ర కమిటీ స్టాఫ్ కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. మరణించిన ఏడాదిన్నర తర్వాత ఈ విషయాన్ని మావోయిస్టులు ధ్రువీకరించారు. రవి స్వస్థలం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మాయపాలెం. 2020 జూన్ 25న బాణం బాంబు తయారు చేసి పరీక్షించే క్రమంలో ఆయన మృత్యువాతపడ్డారు. మావోయిస్టు పార్టీ విప్లవ లాంఛనాలతో రవి అంత్యక్రియలు జరిపింది.
కాగా ఆయన 2014లో గెరిల్లా జోన్‌లో విధులు నిర్వహించారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్‌లో రవికి నైపుణ్యం ఉంది. అత్యాధునిక ఐఈడీలు అమర్చడంలో రవి ఆరితేరారు. పీఎల్‌జీఏకు కొత్త ఆయుధాలు సమకూర్చడంలో రవి కీలకపాత్ర పోషించారు.
ఇదీ చదవండి: Kannababu: ఈ-క్రాప్ ద్వారా పంట నష్టపోయిన రైతులను గుర్తించాలి: కన్నబాబు