ETV Bharat / city

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్ - Maulana Abul Kalam Azad jayanthi in thadepalli

ముస్లింల కుటుంబాల్లో వివాహాల కోసం వైఎస్ఆర్ పెళ్లి కానుకను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇమామ్​లు, మౌజమ్​లు, పాస్టర్ల వేతనాలను వచ్చే ఏడాదిలో మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి..అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం 3వేల 428 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. వక్ప్స్ బోర్డులు, క్రిష్టియన్ మిషనరీల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

cm jagan
సీఎం జగన్
author img

By

Published : Nov 11, 2020, 2:23 PM IST

Updated : Nov 12, 2020, 3:22 AM IST

తాడేపల్లిలోని సీఎంక్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. జాతీయ విద్య, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. క్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. పలు జిల్లాల్లోని ముస్లిం సోదరులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మంత్రులు కొడాలి నాని,సీఎస్‌ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానిక ఆబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలను సీఎం జగన్ కొనియాడారు. స్వాతంత్రం వచ్చాక దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆజాద్... ఎన్నటికీ మరువలేమన్నారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు సంస్కరణలు తీసుకువచ్చారని...కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక కమిషన్లు, బోర్డులు, విద్యా సంస్థలు ఆయన హయాంలో ప్రారంభించారని, విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యా విధానాన్నే అమలు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు, పథకాలు వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్దిదారులకు మేలు చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2020 అక్టోబర్ వరకు మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా 3 వేల 428 కోట్లు అందించామని సీఎం అన్నారు. వీటిలో 2వేల 585 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయగా... మిగిలిన 843 కోట్లు మరికొన్ని పథకాల ద్వారా అందించామన్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో కలిపి కేవలం 2వేల 661 కోట్లు మాత్రమే మైనార్టీలకు ఇచ్చారని సీఎం ఆరోపించారు. ప్రభుత్వంలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. ఎన్నికలకు ఆరు నెలల ముందు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చారన్నారు.

నంద్యాల ఘటన భాధ కలిగించింది...

నంద్యాల ఘటన భాధ కలిగించిందన్న - సీఎం జగన్.. ఘటన జరిగిన వెంటనే బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడా తన మన బేధం చూపలేదని...బాధ్యులైన పోలీసులను అరెస్టు చేశామన్నారు. తెదేపా క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేసి తెప్పించగా.. బెయిల్ ను రద్దు చేసేందుకు పై కోర్టుకు వెళ్లామన్నారు.

మా పలుకుబడి సరిపోవట్లేదు..

'నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం, ఆయన కుటంబం ఆత్మహత్య ఘటనల్లో న్యాయబద్ధంగా చేయాల్సింది చేశాం. సీఐ, హెడ్ కానిస్టేబుల్స్​ పై కేసులు పెట్టి అరెస్ట్ చేశాం. కానీ తెదేపాకు చెందిన కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావు వారి తరపున పిటిషన్ వేసి బెయిల్ ఇప్పించారు. అంటే వారే పిటిషన్ వేయించి తిరిగి వారే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. వారి పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు. అయినా బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టు కెళ్లాం' - సీఎం జగన్

త్వరలో ఆ రెండు పథకాలు అమలు చేస్తాం..

హాజ్ యాత్రకు వెళ్లేవారికోసం చేసే ఆర్ధిక సాయాన్ని 30-60 వేల రూపాయలకు పెంచామన్నారు. ఇమామ్​లకు 5వేలు, మౌజుమ్​లకు 3 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. వక్క్ప్ బోర్డులను, క్రైస్తవ మిషనరీల ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వక్ప్స్ భూములను కాపాడేందుకు డిజిటలైజేషన్ చేస్తున్నామని..వక్ప్స్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ తరపున నలుగురు ముస్లింలకు ఎమ్మెల్యేలుగా గెలిపించాం. ఇద్దరిని ఎమ్మేల్సీలుగా అవకాశం కల్పించామన్నారు. మైనార్టీల ఆర్థిక, సామాజిక, పరిస్ధితిలో మార్పు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్న సీఎం....మదర్సాల్లో చదువుతోన్న 33 వేలమంది ముస్లిం పిల్లలకు మధ్యాహ్న భోజనం సహా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప జేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీల్లో రెండు మాత్రమే మిగిలాయని..వైఎస్​ఆర్ పెళ్లి కానుక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇమామ్​లకు, మౌజమ్​లకు, పాస్టర్లకు గౌరవ వేతనం వచ్చే ఏడాది పెంచుతామన్నారు సీఎం.

రాష్ట్రంలో ఉర్దూను రెండో లాంగ్వేజీగా చేయాలని ముస్లిం సోదరులు సీఎంను కోరగా...ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను నాడు-నేడు కింద అభివృద్ది చేయాలని... అమ్మఒడి వర్తింప జేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలు ప్రభుత్వం పరిధిలోకి వస్తే అభివృద్ది చేసేందుకు సిద్దమని సీఎం స్పష్టం చేశారు. నాడు-నేడు కింద పాఠశాలలను బాగు చేసేందుకు 12 వేలకోట్లు ఖర్చు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి...ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటునకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

'డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇస్తే.... ఇలాంటి ఘటనలే జరుగుతాయ్'

Last Updated : Nov 12, 2020, 3:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.