ETV Bharat / city

'99 శాతం రికవరీ రేటు.. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్​ సాధిస్తాం'

Margadarsi MD : కొవిడ్ కారణంగా సాధించలేకపోయిన రూ.12 వేల కోట్ల టర్నోవర్​ను ఈ ఏడాది సాధిస్తామని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. సంస్థ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ లక్ష్యాలను వివరించారు. చిట్ ఫండ్ ఇండస్ట్రీపై భారీ జీఎస్టీలు విధించడం వల్ల సభ్యులు సంస్థాగత చిట్‌ఫండ్ నుంచి అన్ ఆర్గనైజ్డ్​ చిట్‌ఫండ్‌కు మారే ప్రమాదం ఉందని శైలజా కిరణ్ హెచ్చరించారు.

Margadarsi MD
Margadarsi MD
author img

By

Published : Sep 30, 2022, 7:09 PM IST

Updated : Sep 30, 2022, 8:25 PM IST

'99 శాతం రికవరీ రేటు.. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్​ సాధిస్తాం'

Margadarsi MD : మార్గదర్శి చిట్​ఫండ్ విజయానికి రికవరీనే ప్రధాన కారణమని సంస్థ ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. 99 శాతం రికవరీ రేట్​తో మార్గదర్శి సంస్థ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. సంస్థ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా తమ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. కొవిడ్ కారణంగా సాధించలేకపోయిన రూ.12 వేల కోట్ల టర్నోవర్​ను ఈ ఏడాది సాధిస్తామని ఆమె తెలిపారు.

3 రోజుల్లోనే సెటిల్​మెంట్: ప్రస్తుతం సంస్థ 4 రాష్ట్రాల్లో 108 శాఖలు, 4300 మంది ఉద్యోగులతో రూ.10 వేల టర్నోవర్​ సాధించిందని శైలజా కిరణ్ వివరించారు. మధ్య తరగతి కలలకు చిట్స్ ఎంతో ప్రత్యేకమైనదని.. తమ సంస్థలో సామాన్యులు మొదలుకొని అన్ని రంగాల్లో ప్రముఖులు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రూ.9,700 కోట్ల టర్నోవర్​ సాధించామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా మార్గదర్శి సేవలు అందించిందని.. అత్యవసర పరిస్థితుల్లో చిట్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే వారికి 3 రోజుల్లోపే సెటిల్ చేస్తున్నామని శైలజా కిరణ్ తెలిపారు.

భారంగా మారిన జీఎస్టీ..: చిట్​ఫండ్​ రంగంపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న అధిక జీఎస్టీ భారంగా మారిందని.. దీనిపై కేంద్రం మరోసారి పరిశీలన చేయాలని మార్గదర్శి ఎండీ సూచించారు. భారీ జీఎస్టీ విధించడం వల్ల సభ్యులు సంస్థాగత చిట్‌ఫండ్ నుంచి అన్‌ ఆర్గనైజ్డ్ చిట్‌ఫండ్​కి మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇవీ చూడండి..

Last Updated : Sep 30, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.