రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన వర్గపు స్థిరాస్తి వ్యాపార ప్రయోజనాల కోసమే 3 రాజధానుల నాటకం ఆడుతున్నారని మావోయిస్టు విశాఖ - తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ ఆరోపించారు. గతేడాది.. ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైకాపా చేసిన దాడులు, అరాచకాలు దోపిడీ రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టాయని విమర్శించారు.
అవినీతి రహిత పాలన అంటూ మాటలు చెబుతున్న జగన్.. ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.వేల కోట్లను అక్రమంగా దోచుకున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట జగన్ ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తుతున్నారని ఆరోపించారు. ఆ పథకాలకు ఖర్చు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ అప్పుగా మార్చేసి.. వాటిని పన్నుల రూపంలో ప్రజల నెత్తిన రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆమె పేరిట ఓ లేఖ విడుదలైంది.
ఇదీ చదవండి: