ETV Bharat / city

గుండెపోటుతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి - ఏపీ తాజా వార్తలు 2021

మావోయిస్టు గడ్డం మధుకర్ గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా చికిత్స కోసం వచ్చిన అతన్ని తెలంగాణలోని వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​ ఉస్మానియాలో కొవిడ్​కు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. మధుకర్ మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తరలించారు.

మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి
maoist madhukar died of heart attack
author img

By

Published : Jun 6, 2021, 4:51 PM IST

మావోయిస్టు గడ్డం మధుకర్ గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా చికిత్స కోసం వచ్చిన మధుకర్​ను ఈనెల 2న పోలీసులు పట్టుకున్నారు. అనంతరం చికిత్స అందించేందుకు ఉస్మానియాకు తరలించారు. కొవిడ్​కు చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు.

కుమురంభీం జిల్లా పెంచికల్​పేట మండలం కొండపల్లికి చెందిన గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్​లో చేరాడు. ప్రస్తుతం అతను దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మధుకర్ మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం కొండపల్లికి తరలించారు.

ఇదీ చదవండి : Dhulipalla Narendra: తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.