ప్రజల సమక్షంలో మే 25 నుంచి 29 వరకు 'మన పాలన- మీ సూచన' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులు, ముఖ్యనాయకులు, నైపుణ్యం సాధించిన వారితో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న దానిపై ప్రజలు సూచనలు ఇస్తారని ఆయన తెలిపారు.
ఈనెల 25న పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయ వ్యవస్థపై చర్చ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలపై సూచనలు తీసుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు. 27న విద్యారంగంలో మార్పులపై సూచనలు, 28న పరిశ్రమలకు వసతులపై సూచనలు, మౌలిక సదుపాయలు నైపుణ్యాభివృద్ధిపై సూచనలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. 29న ఆరోగ్యశ్రీలో మార్పులు వంటి అంశాలపై సమీక్షించుకోనున్నట్లు తెలిపారు.