జూలై 29వ తేదీ 2022.. సమయం మధ్యాహ్నం 2 గంటలు.. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని ఒక మెడికల్ షాప్.. 60 ఏళ్ల వయసున్న ఫిచిట్ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఆ షాపులో చోరీ చేస్తే ఏం జరుగుతుందో తెలియజేసే.. పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి. దొంగిలించిన వస్తువు విలువకన్నా.. ఏకంగా 30 రెట్లు వసూలు చేస్తారు. ఆ తర్వాత జైలుకు సైతం పంపిస్తారు. అందుకే.. ఆ షాపును ఎంచుకున్నాడు ఫిచిట్.
లోనికి వెళ్లిన వృద్ధుడు.. సిబ్బంది తనను చూసేంత వరకూ ఆగి.. మూడు సబ్బులు తీసుకున్నాడు. వెంటనే సెక్యూరిటీ వాళ్లు వచ్చి పట్టుకున్నారు. చోరీ చేసినందుకు తిట్టిపోశారు. ఇదంతా చూసిన ఓ కస్టమర్ వచ్చి.. "ఆ వృద్ధుడిని వదిలేయండి.. ఆ సబ్బుల ధర నేను చెల్లిస్తాను" అన్నాడు. కానీ.. అందుకు ఫిచిట్ ఒప్పుకోలేదు. తాను చోరీ చేశాను కాబట్టి.. తనను పోలీసులు అరెస్టు చేయాల్సిందేనని అన్నాడు. దీంతో.. అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులు.. ఆ వృద్ధుడి పరిస్థితేంటో అర్థంకాక.. వెళ్లిపొమ్మన్నారు. కానీ.. ఫిచెట్ పట్టు వదలట్లేదు. పోలీసులు రావాల్సిందే.. తనను అరెస్టు చేయాల్సిందేనని భీష్మించాడు. దీంతో.. అనివార్యంగా పోలీసులకు ఫోన్ చేశారు. వారు.. ఘటనా స్థలానికి వచ్చేశారు.
"ఏం జరిగింది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?" అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు ఫిచెట్ చెప్పిన మాటలు.. అక్కడున్న వారి హృదయాల్లో ఏ మూలనో సూదిలా గుచ్చినట్టైంది. "నా వయసు 60 ఏళ్లు. కష్టం చేయలేని శరీరం.. ఆకలికి ఆగలేని జానెడు పొట్ట.. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు.. ఈ బాధ నేనెట్టా భరించేది? ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆకలికి మాడిపోయి నేను చచ్చిపోవడం ఖాయం. అదే జైలుకు వెళ్తే.. నాకు మూడు పూటలా తిండి దొరుకుతుంది. అందుకే దొంగతనం చేశాను.. నన్ను అరెస్టు చేయండి" అన్నాడు. ఇది విన్న పోలీసులు.. అక్కడి జనాలు.. మౌనంగా తలలు వాల్చారు. తారస్థాయికి చేరిన ద్రవ్యోల్బణంతో.. థాయిలాండ్ దేశం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక కష్టాలకు.. అక్కడి జనం పడుతున్న అవస్థలకు.. ఫిచెట్ సజీవ సాక్ష్యంగా నిలిచారు!
ఆకలి బాధ.. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. "నువ్వు ఏదైనా తింటావా? లేక నిన్ను తినమంటావా?" అంటుంది ఆకలి. ఓన్లీ వన్ ఛాయిస్! నో.. సెకండ్ ఛాయిస్!! ఎంత దారుణం ఇదీ?! ఒక మనిషి అరవై ఏళ్లపాటు కష్టపడినా.. తినడానికి తిండికూడా లేని దుర్భర స్థితిలో.. జీవితపు ఆఖరి దశను గడపాల్సి రావడం ఎంత ఘోరం? ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. "అన్నింటికీ మందులు కనిపెట్టే సైంటిస్టులు.. ఇలాంటి నిర్భాగ్యుల కోసమైనా.. ఆకలికి సైతం ఓ మందు కనిపెడితే బాగుండేది" అని అనిపించకమానదు!
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..
- ఓ మంచి దేవుడా..! ఎందుకయ్యా గిట్ల చేసినవ్..?!
- అక్కడ వధూవరులను అమ్ముతున్నారు.. "మీలో ఎవరైనా షాపింగ్ చేస్తారా?"
- పోలీస్ స్టేషన్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. మేనేజర్ పోస్టు కావాలట!