ETV Bharat / city

Online Food: పాయలో బల్లి అవశేషాలు.. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు

author img

By

Published : Jun 6, 2021, 10:50 AM IST

సాయంత్రం పూట భోజనం చేద్దామని ఫుడ్ ఆర్డర్​ పెట్టిన ఓ వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కన్పించాయి. అప్పటికే అతని కుమార్తె రెండు స్పూన్లు తినడంతో ఆందోళన చెందిన అతను.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు.

lizard in paya
పాయలో బల్లి అవశేషాలు
పాయలో బల్లి అవశేషాలు

హైదరాబాద్ కూకట్​పల్లిలో రహమాన్ అనే వ్యక్తి.. శనివారం సాయంత్రం కృతుంగా రెస్టారెంట్​ నుంచి పాయ ఆర్డర్ పెట్టుకున్నాడు. డెలివరీ బాయ్​ ఆర్డర్​ తీసుకురాగానే తన కుమార్తె పాయను రెండు స్పూన్లు తిన్నది. రహమాన్​ కూడా తిందామని చూసేలోగా అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. వెంటనే తన కుమార్తెను ఆస్పత్రికి తరలించిన అతను.. హోటల్​ యజమాని వద్ద వెళ్లి నిలదీయగా అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

అనంతరం రహమాన్ కూకట్​పల్లి పోలీసులను ఆశ్రయించాడు. హోటల్​ వద్దకు చేరుకున్న పోలీసులు పాయాను పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. కలుషిత ఆహారం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానిని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దాతల ఔదర్యం.. వారికి రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.