తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ పట్టణంలోని కంకరబోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మాజహర్ భవన నిర్మాణ పనులు చేసేవాడు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఓ భవనంలో పని చేస్తుండగా కోతుల గుంపు ఒక్కసారిగా అతడి వైపు వచ్చాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అతను అదుపు తప్పి భవనంపై నుంచి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య గర్భిణి కాగా... బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడి కుటుంబ సభ్యులు!