ETV Bharat / city

వార్డులోకి అనుమతించలేదని డాక్టర్​ను కొరికేశాడు! - assault on doctor in odisha

ఆసుపత్రిలో ప్రసూతి వార్డులోకి అనుమతించలేదంటూ ఓ గర్భిణి భర్త వైద్యుడి చెవి కొరికాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

assault on doctor
డాక్టర్​పై దాడి చేసిన గర్భిణీ భర్త
author img

By

Published : May 11, 2020, 11:59 AM IST

ఒడిశాలోని గంజాం జిల్లా పురుషోత్తంపూర్‌ ప్రాంతానికి చెందిన తరిణి ప్రసాద్‌ మహాపాత్ర్‌ తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వద్ద ఐదుగురు కుటుంబ సభ్యులుండగా, తానూ ప్రసూతి వార్డుకు వెళ్తానని ఆయన పట్టుబట్టాడు. అందుకు నిరాకరించిన వైద్యుడు స్మృతిరంజన్‌పై దాడి చేశాడు.

అక్కడే ఉన్న పీజీ వైద్యవిద్యార్థి షకీల్‌ఖాన్‌, మరో నలుగురు వైద్యులు అడ్డుకోగా షకీల్‌ ఎడమ చెవి కొరికేయడంతో పాటు మిగిలిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తరిణి ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ పినాక్‌ తెలిపారు.

ఇదీ చూడండి: వైరస్​పై పోరుకు భారీ విరాళాలిచ్చిన 10 మంది వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.