హైదరాబాద్ అంబర్‌పేటలో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తెలంగాణ కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య(23)గా గుర్తించారు. అతని వద్ద నుంచి 824 మిల్లీ గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్ నుంచి నగరానికి కొరియర్ ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: