కర్ణాటకలో గత రెండు రోజులుగా తూర్పు ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీ శాంతరాజ్ ఆదేశాలతో.. వాహనల నంబర్ ప్లేట్లపై ఆపరేషన్ జరుగుతోంది. సరైన నెంబర్ ప్లేట్లు లేని, నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్న వందలాది వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
నెంబర్ ప్లేటుపై 'వైఎస్‌జే'
కేఆర్ పురం ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు సరైన నంబర్ ప్లేట్ లేని కారును కనుగొని యజమానికి జరిమానా విధించారు. ఏపీకి చెందిన కొందరు.. ఓ కారులో కర్ణాటక వెళ్లారు. అక్కడ ఆ కారు నంబర్ ప్లేట్‌లో ఆంధ్ర సీఎం జగన్ పేరును చూసిన కేఆర్ పురం పోలీసులు.. ఆపి తనిఖీ చేశారు. కారు నెంబర్ AP39 JG 451. కానీ రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా చివరి 3 అంకెలు(451) వైఎస్‌జే అన్న ఫాంట్ మాదిరిగా ఉన్నాయి. ఇది మోటార్ వెహికిల్ చట్టానికి విరుద్ధం.
కేఆర్ పురం ట్రాఫిక్ పోలీసు అధికారి ఎంఏ మొహమ్మద్, కారు యజమానికి జరిమానా విధించి నంబర్ ప్లేట్ మార్చమని హెచ్చరించారు. కారు యజమాని ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద అభిమాని కావటంతో అతను నంబర్ ప్లేట్‌లో వైఎస్‌జే అక్షరాలను ఉపయోగించినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: RRR LETTER TO CM: 'రాజకీయాల కోసం.. నీటి గొడవలు పెద్దవి చేయొద్దు'