అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు పనిచేసేలా చూడాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాలకు చెప్పారు. పారిశ్రామిక భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించారు.
వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వలస కార్మికులు రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులపై నడిచి వెళ్లకుండా నివారించాలని...అలాంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి రవాణా సదుపాయం కల్పించాలని రాజీవ్ గౌబా ఆదేశించారు.
వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్న ఆయన... బస్సులు, రైళ్ల రాకపై ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. విదేశాలలో చిక్కుకున్న వారిని విమానాలు, ఓడలు ద్వారా తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు.
ఆయా రాష్ట్రాల్లోకి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని సూచించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: