పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో మహిళా అష్టావధానం జరిగింది. అవధాన విద్యా సరస్వతి బులుసు అపర్ణ మహిళా అష్టావధానం చేపట్టారు. జూమ్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవాని ప్రసాద్, ఈనాడు సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆత్మీయ అతిథులుగా మా శర్మ , డాక్టర్ కొర్రపాటి మధు, వడలి రమేశ్ పాల్గొన్నారు. గురు సహస్త్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. సభాధ్యక్షుడిగా గజల్ శ్రీనివాస్ వ్యవహరించారు. తెలుగు సాహితీ ప్రియులను ఈ కార్యక్రమం ఆద్యంతం అలరించింది.
ఇదీ చదవండి: