ETV Bharat / city

పోలీసుల మానవత్వం... మతిస్థిమితం లేని యువకునికి చికిత్స - mahaboobabad latest news

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్​ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిస్థిమితం లేని ఓ యువకున్ని చేరదీసి చికిత్స అందించారు. అనంతరం ఆ యువకున్ని ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్​లో చేర్పించి ఆశ్రయం కల్పించారు.

police humanity
మతిస్థిమితం లేని యువకుడికి చికిత్స చేయించిన పోలీసులు
author img

By

Published : Feb 21, 2021, 7:29 AM IST

మతిస్థిమితంలేని ఓ యువకునికి చికిత్స చేయించి.. స్వచ్ఛంద సంస్థలో చేర్పించి తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్​ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్​నగర్​లో తిరుగుతున్న ఓ అపరిచిత వ్యక్తిని దొంగగా భావించిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకటరత్నం ఆదేశాలతో ఎస్సై మురళీధర్​రాజు తన సిబ్బందితో కలిసి కాలనీకి వెళ్ళారు. పోలీసులను చూసిన అపరిచిత వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

చీకటిలో సుమారు 2 గంటల పాటు శ్రమించిన పోలీసులు.. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నారు. విచారించగా.. ఊరు, పేరు సరిగా చెప్పకపోవటం వల్ల మతిస్థిమితం సరిగాలేదని గుర్తించారు. యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ యువకుడిని ఆశ్రమంలో చేర్చుకోవాలని.. ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్​ను సీఐ వెంకటరత్నం కోరారు. ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు.. ఆ యువకుడిని తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమంలో చికిత్స అందించి పూర్వ స్థితికి తీసుకొస్తామని.. యువకుని వివరాలు తెలిస్తే.. తమను సంప్రదించాలని ఫౌండేషన్​ నిర్వాహకులు కోరారు.

ఇదీ చూడండి: సినీనటి కావాలని ముంబయి బయలుదేరిన బాలిక.. షాకైన ఆర్పీఎఫ్ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.