ETV Bharat / city

ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ - ఆక్సిజన్ కేటాయింపు, సరఫరాపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
author img

By

Published : May 11, 2021, 5:13 PM IST

Updated : May 12, 2021, 3:46 AM IST

17:10 May 11

రాష్ట్రంలో పరిస్థితి వివరించిన ముఖ్యమంత్రి

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

రాష్ట్రానికి ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులను 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 24న రాష్ట్రానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని.. అయితే అప్పుడు రాష్ట్రంలో కేసులు 81వేల 471 కేసులు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ బాధితుల సంఖ్య లక్షా 87 వేలు దాటిందని.. కేంద్రం ప్రస్తుతం కేటాయిస్తున్న ఆక్సిజన్‌.. బాధితుల చికిత్సకు సరిపోవడం లేదని పేర్కొన్నారు.

తమిళనాడు, బెంగళూరు నుంచి రాయలసీమ జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోందని చెప్పారు. చెన్నై నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యమే తిరుపతిలో 11 మంది మృతికి కారణమైందని ప్రధానికి రాసిన లేఖలో జగన్‌ వివరించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్న ఆక్సిజన్‌ సరఫరాను పెంచకపోతే సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బళ్లారి నుంచి ప్రస్తుతం 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోందని.. దీన్ని 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు. అలాగే ఒడిశా నుంచి 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోందని దీన్ని 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు... 20 ఎల్ఎమ్​వో ట్యాంకర్లను అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని లేఖలో కోరారు.

‘కొవాగ్జిన్‌’ సాంకేతికతను బదిలీ చేయాలి

‘దేశ అవసరాలకు అనుగుణంగా కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆ సాంకేతికతను దేశంలో వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేలా భారత్‌ బయోటెక్‌కు సూచించాలి. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు ఇతర ఫార్మా సంస్థలకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి. ఆ సాంకేతికతను, అందుకు ఉపయోగపడే మేధోపరమైన హక్కులను బదలాయించేలా చూడాలి’’ అని ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మంగళవారం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు.  ‘మీ నాయకత్వంలో స్వదేశీ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటిక్‌ తయారు చేసింది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకరించాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను భారత బయోటెక్‌ (బయోసేఫ్టీ లెవెల్‌ 3) తయారు చేస్తోంది. 2021 జనవరిలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులూ ఇచ్చింది. ఈ టీకా ఉత్పాదక సామర్థ్యం ప్రస్తుత దేశ అవసరాలను తీర్చలేదని తెలిసింది. ఇదే వేగంతో ఉత్పత్తి చేస్తే టీకాలు వేయడానికి చాలా కాలం పడుతుంది. అందుకే కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆసక్తి ఉన్న వారికి ఆ సాంకేతికతను బదిలీ చేయాలి. ఇందుకు మేధో ఆస్తి హక్కులు(ఐపీఆర్‌), పేటెంట్లు వంటివి అడ్డంకి కాబోవు’ అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఆసక్తి చూపే కంపెనీలను, సామర్థ్యం ఉన్న సంస్థలను ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ప్రోత్సహించాలి. ఈ విషయంలో మీ జోక్యాన్ని కోరుకుంటున్నాను. ఈ చర్య వ్యాక్సిన్ల సరఫరాను వేగవంతం చేస్తుంది’ అని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.

   ‘ఏపీలో ప్రస్తుతం 1,86,695 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నివారణకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. చికిత్సకు ఏర్పాట్లు చేశాం.  ఎన్ని చర్యలు తీసుకున్నా అంతిమ పరిష్కారం టీకా వేయడమే. గతంలో మేం రోజుకు 6 లక్షల టీకాలు వేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించాం. టీకాల కొరత వల్ల జనాభాకు తగ్గట్టుగా వాటిని వేయలేకపోతున్నాం’ అని ముఖ్యమంత్రి ప్రధానికి లేఖలో వివరించారు.

ఇదీ చదవండి:

కరోనా రోగి మృతదేహాన్ని నడిరోడ్డుపైనే దింపేయడం అమానుషం: చంద్రబాబు

దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

Last Updated : May 12, 2021, 3:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.