Indian Meteorological Department : అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో .. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఏపీ, ఒడిశా, బంగాల్ తీరాల వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి: