ETV Bharat / city

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు

author img

By

Published : Jul 22, 2021, 12:56 PM IST

Updated : Jul 22, 2021, 3:30 PM IST

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.

weather
weather

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలియజేసింది. సముద్రంలోనూ అలల తీవ్రత పెరిగే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.

rains
బంగాళాఖాతంలో అల్పపీడనం

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. జలాశయాలకు భారీగా వరద

'డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనతో షాక్​ అయ్యాం'

Last Updated : Jul 22, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.