హైదరాబాద్‌లోని లోటస్ ఆస్పత్రిలో(Lotus Hopaital) మల్టీ స్పెషాలిటీ సేవలను ప్రారంభిస్తున్నట్లు సీఈవో డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. లక్డీకాపూల్‌లో 2006లో ప్రసూతి సేవలతో ప్రారంభమైన ఆస్పత్రి ప్రస్తుతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి ప్రారంభించి దిగ్విజయంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
లోటస్ ఆస్పత్రిలో (Lotus hospital)ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు వీఎస్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అనుమతులతో ఇకనుంచి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, వాస్క్యులర్, న్యూరో, లాప్రోస్కోపిక్ సర్జరీ వంటి ఆధునిక సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి ఈ నెల 25 వరకు అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నామని సీఈవో డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ ప్రకటించారు. సామాన్యులకు సైతం మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఫీజులను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.
మెడికల్ అథారిటీ నుంచి మాకు గుర్తింపు వచ్చింది. ఇక నుంచి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా వైద్య సేవలను అందించబోతున్నాం. ప్రజలకు, మా శ్రేయోభిషులకు ఈనెల 10వ తేదీ నుంచి 25 వరకు ఉచితంగా కన్సల్టేషన్ అందజేస్తున్నాం. మేము ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నాం. ప్రజల నుంచి సలహాలు స్వీకరించాం. చాలా పాజిటివ్‌గా ఫీడ్ బ్యాక్ వచ్చింది. లోటస్ ఆస్పత్రిలో అన్ని రకాల వయసుల వారికి సేవలు ప్రారంభిస్తున్నాం. ఎవరైనా ఇప్పుడు మా ఆస్పత్రికి రావచ్చు. ప్రతి విభాగంలో నిపుణులైన వైద్యులు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మేము శిక్షణ కూడా ఇచ్చాం. ఆస్పత్రిలో అన్ని వైద్య పరికరాలను ఆప్ గ్రేడ్ చేశాం. ఈ సందర్భంగా మా ఆస్పత్రికి వచ్చే వారికి 15 రోజుల పాటు ఫీజులో తగ్గింపు ఇస్తున్నాం. మనదేశంలో మెరుగైన వైద్య సేవలకు చాలా ఖర్చవుతోంది. మన దగ్గర కార్పొరేట్ ఆస్పత్రుల కంటే తక్కువగానే ఫీజులు ఉంటాయి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రేట్లు తగ్గించాం. ఈ సేవలను భవిష్యత్తులో మరింత విస్తరిస్తాం. -డాక్టర్ వీఎస్వీ ప్రసాద్, లోటస్ ఆస్పత్రి సీఈఓ
ఇదీ చూడండి:
CM Review on Rains: కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..అవసరమైన చోట శిబిరాలు: సీఎం జగన్