రాష్ట్రంలో లేని సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో గోదావరి నుంచి పెన్నా వరకు ఉచిత ఇసుక సరఫరా చేశామని గుర్తు చేశారు.నెల్లూరులో ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఉన్న ట్రక్కు ఇసుక ధర నేడు 5 వేలకు పెరిగిందని మండిపడ్డారు.
పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన ఉందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇసుక కొరతను ఇప్పుడే చూస్తున్నానన్నారు. వరదలవల్ల ఇసుక కొరత అంటున్న వైకాపా మంత్రులు వర్షాలు కురవక ముందు ఏం చేశారని ప్రశ్నించారు. కార్మికుల ఆత్మహత్యలను వైకాపా నేతలు ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో లారీ ఇసుక 10 వేలు ఉంటే నేడు 50 వేలకు చేరిందని మండిపడ్డారు.
ఇదీచదవండి