మద్యపాన నిషేధం కోసం జగన్ 'మంద'డుగు వేస్తూనే ఉన్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామాల్లో బెల్టుషాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. జగనన్న... మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతం కంటే అమ్మకాలు తగ్గాయేమో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
ఇదీ చదవండి... ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల ఘనత