ETV Bharat / city

చేనేత రంగంపై జీఎస్టీ పెంపు వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి లోకేశ్ లేఖ

Lokesh Letter to Nirmala Sitaraman: చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్‌కు లోకేశ్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని ఆయన లేఖలో ప్రశ్నించారు.

Lokesh Letter to Nirmala Sitaraman
నిర్మలమ్మకు లోకేశ్ లేఖ...
author img

By

Published : Mar 5, 2022, 2:43 PM IST

Lokesh Letter to Nirmala Sitaraman: చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై 5శాతమే భారం అనుకుంటే.. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచడమేంటని ఆయన లేఖలో ప్రశ్నించారు.

ముడిసరుకులపైనా 25శాతం మేర పన్ను పెంచినందున రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి పోయాయన్నారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాయితీలు, రుణాలు అందజేయాలన్నారు.

ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 65 లక్షల మంది చేనేత రంగం పై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారని వివరించారు. దేశ వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకి ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖద్దరు, కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ చీరలు, మంగళగిరి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయని వివరించారు.

ఇదీ చదవండి : MLA Ramanaidu injured: సైకిల్​పై నుంచి పడిపోయిన ఎమ్మెల్యే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.