లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. మరో 81 వేల మంది పవర్ లూమ్ కార్మికులపైనా.. లాక్‌డౌన్ ప్రభావం చూపిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల వల్ల చేనేత కార్మికుల జీవన విధానం దెబ్బతింటుందన్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆప్కో ద్వారా చేనేత కార్మికుల వద్ద తయారై సిద్ధంగా ఉన్న స్టాక్‌ను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి చేనేత కుటుంబానికి 15 వేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు