ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి వేణుమాధవ్ మరణం విచారకరమన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు... అతను పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చూడండి: