ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఛాన్సే లేకుండా చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు . అప్పు ఫుల్లు అభివృద్ధి నిల్లు అన్న రీతిలో ఏడాదిలో 86 వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారన్నారు. జగన్ రాష్ట్ర ఆస్తులు అమ్మి అవినీతి కోటలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రివర్స్ పాలన, బెదిరింపుల దెబ్బకి కంపెనీలు పారిపోయాయని విమర్శించారు. దొంగ మద్యం బ్రాండ్లు తేవడం తప్ప ఒక్క కంపెనీని రాష్ట్రానికి తీసుకురాలేక పోయారని ధ్వజమెత్తారు. కొత్త ఉద్యోగం ఒక్కటీ రాలేదని, రోడ్డు వేయలేదని.. ఏ ప్రాజెక్టులోనూ బొచ్చెడు కాంక్రీట్ వేసింది లేదని లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇదీ చదవండి : ఇసుకను తులాల లెక్కన అమ్మిన ఎమ్మెల్యే!