ETV Bharat / city

తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్​డౌన్​ పొడిగింపు - తెలంగాణలో లాక్​డౌన్

తెలంగాణలో లాక్​డౌన్​ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈనెల 30 వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి నివారణకు లాక్​డౌన్​ తప్ప వేరే మార్గం లేదని.. ప్రజలు అర్థం చేసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలను కోరారు.

తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్​డౌన్​ పొడిగింపు

author img

By

Published : Apr 13, 2020, 7:52 AM IST

తెలంగాణలో లాక్​డౌన్​ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకూ రాష్ట్రంలో లాక్​డౌన్​ కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం కూడా గణనీయంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇవీ చూడండి:

కరోనా: పరీక్షలు 4 రకాలు... ఏది కచ్చితం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.