ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. రంజాన్​ మాసంలో పాతబస్తీ వెలవెల - హలీంపై రంజాన్​ ప్రభావం

పవిత్ర రంజాన్‌ మాసంలో రద్దీగా ఉండే పాతబస్తీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో బోసిపోయింది. ఉపవాస దీక్షలు చేసిన తర్వాత విరమించే ముస్లింలు.. మదీనా, చార్మినార్‌, మొజంజాహి మార్కెట్‌ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ షాపింగ్‌ చేస్తారు. రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలు నిత్యం విద్యుత్‌ దీపాలతో కళకళలాడుతుంటాయి. అయితే ఈసారి రంజాన్‌ మాసం పూర్తిగా భిన్నంగా మారింది. కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉండడం వల్ల.. సందడి కనిపించడం లేదు.

lockdown-effect-on-ramzan-all-markets-remain-empty-in-hyderabad
రంజాన్ మాసంపై కరోనా ప్రభావం
author img

By

Published : May 1, 2020, 3:05 PM IST

రంజాన్‌ మాసం ప్రత్యేకతకు పాతబస్తీ ఎంతో ప్రఖ్యాతి గాంచింది. మాసం ప్రారంభం నుంచి రంజాన్‌ పండుగ ముగిసే వరకు ఇక్కడ నిత్యం హడావిడి, సందడి నెలకొంటుంది. ప్రధానంగా రాత్రి వేళల్లో చార్మినార్‌, మదీన, చుడీబజార్‌, మొజంజాహి మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో షాపింగ్‌ చేయడానికి ముస్లింలు అధిక సంఖ్యలో తరలివస్తారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు విధించాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం.. పాతబస్తీలో దుకాణాలన్నీ మూసివేయడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

మోజంజాహి మార్కెట్‌... విభిన్న రకాల పండ్లకు ప్రసిద్ధి. నిత్యం ఇక్కడ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ రంజాన్‌ మాసంలో పండ్లు కొనేందుకు ముస్లింలు పోటీ పడుతుంటారు. పగలంతా ఉపవాస దీక్ష కొనసాగించి... సాయంత్రం విరమించిన తర్వాత పండ్ల మార్కెట్‌కు భారీగా తరలిరావడం వల్ల రద్దీ ఏర్పడుతుంది. ఆంక్షలు అమల్లో ఉండడంతో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

చార్మినార్‌ వద్ద రంజాన్‌ మాసంలో షాపింగ్‌ చేయడానికి వచ్చే వారితో కళకళలాడుతుంటుంది. ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకుంటుండం వల్ల మక్కా మసీదు ఎటువంటి హడావుడి లేకుండా కనిపిస్తోంది. రంజాన్‌ మాసం ఆరంభమైందంటే చాలు ప్రఖ్యాతి గాంచిన హలీం తయారీ కేంద్రాలు అడుగడుగునా కనిపించేవి. ప్రస్తుత హలీం కేంద్రాల జాడే లేదు. పాతబస్తీలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:

160 కోట్ల మంది జీవనోపాధిపై కరోనా దెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.