TRS Wins MLC Election 2021 : తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ తెరాస గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్‌లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒకటి చొప్పున స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
![TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13899749_thuss.jpg)
MLC Election Results 2021 : ఖమ్మంలో తాతా మధు గెలుపొందారు. తెరాసకు 480, కాంగ్రెస్ 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పోలయ్యాయి. 12ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మెదక్‌లోనూ తెరాస అభ్యర్థి యాదవరెడ్డి విజయఢంకా మోగించారు. తెరాస 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మం, మెదక్ రెండో చోట్ల మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్‌కు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 జిల్లాల్లో 6 స్థానాలకు ఈనెల 10న పోలింగ్ జరిగింది.
Local Body MLC Election Results : నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో గులాబీ గెలుపు సాధించింది. 691 ఓట్ల మెజార్టీతో ఎంసీ కోటిరెడ్డి(తెరాస) గెలుపొందారు. తెరాస 917, స్వతంత్రులు నగేశ్ 226, లక్ష్మయ్య 26, స్వతంత్రులు వెంకటేశ్వర్లు 6, రామ్‌సింగ్ 5 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో 50 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం తెరాస కైవసం చేసుకుంది. 667 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి దండే విఠల్ గెలుపొందారు.
TRS Won MLC Election : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ విజయం సాధించారు. భానుప్రసాద్ 584, ఎల్.రమణ 479 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు పోలయ్యాయి.