ETV Bharat / city

మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పట్టవా.. - today news update in government liquore shops

కొవిడ్‌ కల్లోలంతో ఆస్పత్రులు నిండిపోతున్న వేళ.. మద్యం దుకాణాల వద్ద పరిస్థితులు గుబులు పుట్టిస్తున్నాయి. మందుబాటిళ్లు దక్కించుకొనేందుకు పోటీపడే క్రమంలో ఒకరిపై ఒకరు ఎగబడుతున్న దృశ్యాలు ఆందోళన రేపుతున్నాయి. భౌతిక దూరం పాటించేందుకు గొడుగు తీసుకురావాలన్న నిబంధనలు నామమాత్రంగా మిగిలిపోగా.. కనీసం మాస్కు గురించి అడిగేవారూ లేకుండా పోయారు. సాక్షాత్తు ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల వద్దే నిబంధనలకు యథేచ్ఛగా నీళ్లొదులుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Liquor sellers do not follow the covid regulations
కొవిడ్ నిబంధనలు పాటించని మద్యం దుకాణాలు
author img

By

Published : Apr 20, 2021, 7:15 PM IST

Updated : Apr 20, 2021, 7:45 PM IST

కొవిడ్ నిబంధనలు పాటించని మద్యం దుకాణాల నిర్వహకులు

పశ్చిమగోదావరి జిల్లాలో నిత్యం వందలాదిగా కరోనా కేసులు నమోదవుతుండగా.. మద్యం దుకాణాల వద్ద పరిస్థితులు కరోనా వ్యాప్తికి ఆసరాగా నిలుస్తున్నాయి. గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 11గంటలకు దుకాణాలు తెరుచుకొంటుండగా.. అప్పటికే ఆవురావుమంటున్న మందుబాబులు ఒక్కసారిగా దుకాణాలపై పడుతున్నారు. కరోనా గురించి అసలు ఏమాత్రం పట్టని రీతిలో ఒకరినొకరు తోసుకొంటున్నారు.

గతంలో ప్రత్యేక నిబంధనలు..

గతంలో దుకాణాల వద్ద మద్యం కొనుగోలుకు ప్రత్యేక నిబంధనలు విధించారు. వ్యక్తుల మధ్య దూరం ఉండేలా గొడుకు తీసుకురావడం, మాస్కు వేసుకోవడం, శానిటైజర్ వినియోగం తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ఇందులో ఒక్క నిబంధన కూడా అమలు కావడం లేదు. నిబంధనలు పాటించమని దుకాణాల్ల్లో ప్రభుత్వ సిబ్బంది కనీసం చెప్పడమూ లేదు. మద్యం దుకాణాలు ఇళ్ల మధ్య ఉండటం మరో ముప్పుగా మారింది. మద్యం పెద్ద సంఖ్యలో గుంపులుగా కొనుగోలు చేసే కూలీలు.. తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళ్లి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.

చీప్ లిక్కర్ విక్రయిస్తున్న సమయంలో మందు బాబులు బారులు..

అనంతపురం జిల్లాలో మద్యం విక్రయాలే లక్ష్యంగా కరోనా నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 166 మద్యం దుకాణాలు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగులు రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరతో విక్రయించే ఛీప్ లిక్కర్ అమ్మకాలకు ఒక్కో దుకాణంలో ఓ సమయం పాటిస్తున్నారు. గంటసేపు మాత్రమే చీప్ లిక్కర్ విక్రయిస్తున్నందున ఆ సమయంలో మద్యం బాబులు బారులు తీరి, ఎగబడి కొంటున్నారు.

మాస్కులు పెట్టుకోకుండానే మద్యం అమ్మకాలు..

కళ్యాణదుర్గం, కంబదూరు, పామిడి, పెనుకొండ గ్రామీణ ప్రాంతాలు ఇలా అన్నిచోట్లా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 6వందలకు పైగా సిబ్బంది కూడా అధికారులు పట్టించుకోనందున కొవిడ్‌ నిబంధనలకు నీళ్లొదిలారు. ఒక్కో మద్యం దుకాణంలో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్ మెన్ల వరకూ పని చేస్తుండగా.. పలువురు మాస్కులు పెట్టుకోకుండానే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.

పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ..

కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ 6 వందల మందికి కరోనా వైరస్ సోకుతుండగా.. మందుబాబులకు ఇవేమీ పట్టటం లేదు. జిల్లాలోని 165 మద్యం దుకాణాల వద్ద ఉదయం తెరిచింది మొదలు రాత్రి వరకూ మందుబాబుల కోలాహలం కొనసాగుతోంది. భౌతిక దూరం గురించి ఆలోచించే వారు కూడా కనిపించడం లేదు. చాలా మంది మాస్కులు ధరించడం లేదు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు.

ఇవీ చూడండి..: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదు: లోకేశ్

Last Updated : Apr 20, 2021, 7:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.