తెలంగాణ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో వరుసగా రెండు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయిల్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఐదు గేట్లను ఒక అడుగు పైకెత్తి 3,500 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పెద్దవాగుకు వదులుతున్నారు.
ఈ తరుణంలో బండర్‌పల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్దోంది. ఇప్పటికే జలాశయం నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వల్ల.. వచ్చిన వరదను వచ్చినట్టుగా అధికారులు గేట్లు పైకెత్తి వదులుతున్నారు.
ఇదీ చూడండి : విద్యుత్ నగదు బదిలీ పథకానికి మంత్రివర్గం ఆమోదం