ETV Bharat / city

కృష్ణాజలాల వివాదం:నీటి వాటా తేల్చండి..కేంద్రానికి తెలంగాణ లేఖ - కృష్ణా నది తాజా వార్తలు

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
author img

By

Published : Jun 16, 2021, 10:48 PM IST

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.

రెండో అత్యున్నత మండలి సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి హమీ మేరకు పిటిషన్​ను ఉపసంహరించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసి పంపకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే విచారణ కొనసాగుతున్న కృష్ణా నదీజల వివాదాల రెండో ట్రైబ్యునల్​కే తెలంగాణ పిటిషన్​ను నివేదించాలని కోరింది.

ఇదీ చదవండి: Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.