కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లేపాక్షి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సందర్శకులు ఎవరూ మే 15 వ తేదీ వరకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో వీరభద్ర స్వామికి అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక