న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారని... అటువంటి వారిపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. న్యాయమూర్తులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, కోర్టు ధిక్కరణ కింద సుమోటగా కేసు నమోదు చేయాలన్నారు. ఇలాంటివారిని ప్రేరేపిస్తున్న వారి పైన సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులను గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి 'పరువు నష్టం'!