వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని భాజాపా నేత లంకా దినకర్ అన్నారు. బీసీలు, బ్రాహ్మణుల మధ్య గొడవ సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఆస్తులు, ఆదాయాలు మాయమవుతున్నాయని చెప్పారు. జగన్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ క్రీడను ప్రారంభించారని ధ్వజమెత్తారు. వైకాపాలోని రెండు వర్గాలు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారా? లేదా రాజీకి పోతారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నరు..!'