రాష్ట్రంలోని డైట్ కళాశాలల్లో భాషోపాధ్యాయ(ఎల్పీ) తెలుగు అభ్యర్థులకు ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు మంగళవారం నిర్వహించారు. డిగ్రీ తుది సంవత్సర ఫలితాలు ప్రకటించకుండానే కౌన్సెలింగ్ నిర్వహించడంతో పలువురు హాజరుకాలేకపోయారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి 23 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మార్చిలో డిగ్రీ పరీక్షలు రాసిన తెలుగు పండిట్ అభ్యర్థుల ఫలితాలు ఇప్పటి వరకు రాలేదు. కానీ వారు ఎల్పీసెట్‌లో అర్హత సాధించారు.
గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని డైట్‌లలో సీట్లు పొంది డిగ్రీ ఫలితాలు రాని అభ్యర్థులు వచ్చి వెనుతిరిగి వెళ్లిపోయారు. గతంలో డిగ్రీ, పీజీ పూర్తయిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇలా మంగళవారం కృష్ణా జిల్లాలోని అంగలూరు డైట్‌లో 21మందికి గాను ఏడుగురు, గుంటూరులో 39 మందికిగాను 12మంది, తూర్పు గోదావరిలో 55మందికి 11 మంది మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు హాజరుకాని వారికి మరో అవకాశం కల్పిస్తామని కన్వీనర్ నర్సింహరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: