ETV Bharat / city

రెచ్చిపోతున్న మట్టి మాఫియా... యథేచ్ఛగా కంకర, మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు

author img

By

Published : Aug 24, 2021, 3:39 AM IST

రాష్ట్రంలో మట్టి, కంకర, గ్రావెల్‌ మాఫియా అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతోంది. కొండా.. గుట్ట. వాగూ... వంకా.. చెరువు గట్టు.. కాలువ కట్ట. అదీ ఇదీ తేడా లేదు... కన్ను పడితే చాలు.. కొల్లగొట్టి కాసులు పిండుకుంటున్నారు. రాష్ట్రంలో స్థలాలు చదును చేసుకోడానికి, గృహ నిర్మాణాలకు కొన్ని నెలలుగా మట్టి, గ్రావెల్‌, కంకరకు డిమాండు బాగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకుల కన్ను అవి లభ్యమయ్యే ప్రకృతి వనరులపై పడింది. పలుకుబడి ఉపయోగిస్తే చాలు.... ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుండటంతో నాయకులు అక్రమ తవ్వకాలను ప్రధాన వనరుగా మార్చుకుంటున్నారు.

రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రెచ్చిపోతున్న మట్టి మాఫియా

మట్టి, కంకర, గ్రావెల్‌... దేన్ని చూసినా కొందరు నాయకుల కళ్లు మెరుస్తున్నాయి... అక్రమంగా తవ్వేసి అప్పనంగా డబ్బు సంపాదించాలని ఆబగా అడుగేస్తున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగేసి... కాసులు కొల్లగొట్టేస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబసభ్యులు, అనుచరుల్ని ముందుపెట్టి దందా నడిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల... కప్పం నిర్ణయించి మరీ తవ్వకాలకు అనధికారిక అనుమతులిస్తున్నారు. అధికారులు దాడులకు వస్తే వారిపై తీవ్రస్థాయి ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై ‘ఈనాడు, న్యూస్‌టుడే’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందిస్తున్న కథనం.

విశాఖ పేరు చెబితే ఎర్రమట్టి దిబ్బలే గుర్తుకొస్తాయి. ఈ మట్టి దిబ్బల్ని మాఫియా జేసీబీలతో తొలిచేసింది. ఇలా తవ్వితీసిన మట్టిని భారీ వాహనాల్లో తరలించేందుకు వీలుగా ఐఎన్‌ఎస్‌ కళింగ నౌకాదళ స్థావరం నుంచి నేరెళ్లవలస మధ్య 3, 4 చోట్ల అక్రమంగా రోడ్లు నిర్మించింది. సమీప ప్రాంతాల్లోని లేఅవుట్ల చదును కోసమే ఈ మట్టి తరలించారన్న ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు తవ్వకాలను ఇటీవల నిలిపివేయించారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు 6 వేల ఏళ్ల కిందట ఏర్పడినవని చెబుతారు. ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. అక్రమ తవ్వకాలతో ఇప్పుడు ముప్పు ఏర్పడుతోంది.

చెరువుల్ని చెరబట్టి...

దాదాపు 300 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించే నారప్ప చెరువు ఇది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెంలో 62.72 ఎకరాల్లో విస్తరించి ఉంది. స్థానిక నాయకులు కొందరు కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ మట్టిని జేసీబీలతో తవ్వితీస్తున్నారు. రోజూ లక్షల రూపాయలు అక్రమార్కుల పరమవుతోంది. ఇష్టానుసారంగా తవ్వడంతో చెరువు మౌలిక ఆకృతి దెబ్బతింటోంది. మట్టి కోసం ఎక్కువ లోతుకు తవ్వేయడంతో చెరువు పూర్తిగా నిండనప్పుడు ఆ గోతుల్లో నీరు నిలిచిపోయి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలతో గట్టు బలహీనమవుతోంది. ఇదే మండలం రామన్నగూడెంలోని రావులచెరువుదీ ఇలాంటి పరిస్థితే.

* విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వాకాడవలస, కోమటిపల్లి, రామభద్రాపురం మండలంలోని బూసాయివలస, జీఎస్‌ఆర్‌ పురం, బాడంగి మండలం ముగడ చెరువుల్లో కంకర తవ్వి సమీప పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు గ్రావెల్‌ను రూ.500-600కు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొత్తసాగరం చెరువులో గ్రావెల్‌ తవ్వేస్తున్నారు.

కొండల్ని తవ్వేసి... ఎర్రమట్టి మింగేసి

జేసీబీతో దర్జాగా తవ్వేస్తున్న ఈ చిత్రం చూశారా? కర్నూలు జిల్లా డోన్‌ పరిధిలోని లక్ష్యంపల్లె కొండ ఇది. 425 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ తవ్వితీసిన ఎర్రమట్టిని ప్రైవేటు స్థిరాస్తి లేఅవుట్లకు తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వుతున్నారు. వీటికి అనుమతులు లేవు. ఇదే జిల్లా కోడుమూరులో సర్వే నంబరు 181లో 95 ఎకరాల్లో విస్తరించిన కొండను నిత్యం తవ్వేస్తూ గుల్ల చేస్తున్నారు. ట్రాక్టరు లోడు రూ.1,400-1,500 చొప్పున విక్రయిస్తున్నారు. పాణ్యంలోని తమ్మరాజుపల్లి కొండపైన ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని కొండల్ని ఇలాగే పిండి చేస్తున్నారు.

* విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టంలో త్రిశూల పర్వతంగా పేరున్న 3 కొండల్లో 41 ఎకరాల విస్తీర్ణమున్న ఓ పెద్ద కొండ చుట్టూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి గ్రావెల్‌, రాయిని అక్రమార్కులు తవ్వుకుపోతున్నారు. రాత్రివేళల్లో జేసీబీలతో ఈ తవ్వకాలను జరుపుతున్నారు.

* శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని అట్టలి కొండపై ఉన్న కంకరను ఇటీవల భారీగా తరలించారు. స్థానిక నాయకుల అండతో ఈ దందా సాగుతోంది. అక్రమ తవ్వకాలతో కొండ రూపే మారిపోయింది.

పారిశ్రామికవాడలకు కేటాయించిన భూముల్లోనూ..

* కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడ కోసం కేటాయించి... ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల్లో రాత్రిపూట అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి.

* నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సోమశిల ఉత్తర కాలువ గట్టున ఉన్న గ్రావెల్‌ను తవ్వేసి తరలిస్తున్నారు. కావలి నియోజకవర్గం ముసునూరు, తాళ్లపాలెం చెరువుల్లో ఇష్టానుసారంగా తవ్వుతున్నారు.

* అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు మజారాలోని చెన్నకేశవస్వామి ఆలయ మన్యం భూముల్లో నెల రోజులుగా ఇష్టానుసారం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. రెండెకరాల విస్తీర్ణంలో 15 అడుగులకు మించి లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.

* చిత్తూరు జిల్లా రేణిగుంట విప్పమానుపట్టెడ పంచాయతీ పరిధిలోని సూరప్పకశం చెరువులో అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వేస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన ఉండట్లేదు.

ఊరూవాడా అక్రమ తవ్వకాలు.. ఎన్నెన్నో తార్కాణాలు

* విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండ్రాజుపాలెం సమీపంలో అనుమతించిన దాని కంటే ఎక్కువ లోతులో తవ్వకాలు చేపట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కవులవాడ సమీపంలో ఓ నాయకుడు ప్రభుత్వ భూమిలో కంకర అక్రమ తవ్వకాలను చేపట్టి వాటిని సమీపంలోని రిసార్ట్స్‌కు తరలిస్తున్నారు. నెల్లిమర్ల మండలం గరికపేట, సారిపల్లి, జగ్గరాజుపేట, బొప్పడాం, పారసాం ప్రాంతాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పూసపాటిరేగ మండలం చినబత్తివలస సమీపంలో కొండను తవ్వేస్తున్నారు.

* విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో అనుమతుల్లేకుండా రాత్రి సమయాల్లో చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అనంతవరంలోని కుంటివాని చెరువు నుంచి భారీ స్థాయిలో మట్టి తరలిపోయింది. పెందుర్తి మండలం చీమలాపల్లిలో ఎర్రకొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు.

* తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు, తేటగుంట, హంసవరం పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలు జరిపి ప్రైవేటు లేఅవుట్లను చదును చేయడానికి తరలిస్తున్నారు. తొండంగి మండలం బెండపూడి, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి శివారులోని యర్రంపాలెం రెవెన్యూ పరిధిలో డి-పట్టా భూముల్లో జగనన్న కాలనీల కోసమంటూ గ్రావెల్‌ తీసి తరలించారు. గండేపల్లి మండలం మురారి, తాళ్లూరు, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట తదితర గ్రామాల్లో పోలవరం కాలవగట్టు, పుష్కర కాలవగట్టును మట్టి కోసం తవ్వేశారు.

* కడప జిల్లా పుల్లంపేట మండలం దేవసముద్రం, రంగంపల్లి, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలం జిల్లెల మడక, గోవిందంపల్లి చెరువులో మట్టి దోచేస్తున్నారు. జమ్మలమడుగు మండలం గండికోటకు వెళ్లే దారిలో, కన్యతీర్థం సమీపంలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఆ నాయకులకు కప్పం కట్టాల్సిందే

* గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో అక్రమ తవ్వకాలను చేపట్టాలంటే ఆ విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయించిన రేటును స్థానిక ముఖ్య నాయకుడికి ముట్టజెప్పాల్సిందేనన్న ప్రచారం ఉంది.

* నెల్లూరు జిల్లా కావలిలో గ్రావెల్‌, మట్టి అక్రమ తరలింపు అంతా ఓ ముఖ్య నాయకుడికి ప్రధాన అనుచరుడైన మండల స్థాయి నేత కనుసన్నల్లోనే నడుస్తోంది. సాధారణ ప్రజలు వారి అవసరాల కోసం ఎక్కడ తట్టెడు మట్టి, గ్రావెల్‌ తీయాలన్న ఆ నాయకుడికి కప్పం కట్టాల్సిందే.

* ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక నాయకుడు ఒకరికి నెలకు ఇంత మొత్తమని సుంకం చెల్లించాల్సిందే. లేదంటే అధికారులుతో దాడులు చేయిస్తారన్న ప్రచారం ఉంది.

అధికారులపై ఒత్తిళ్లు...

* తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రాంతంలో సుద్ద, ఎర్రమట్టి తవ్వకాల వెనుక స్థానిక నాయకుడు ఒకరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ నాయకుడి పేరు చెప్పి ఆయనే తవ్వుకోమన్నారంటూ సమాధానమిస్తున్నారు.

* కర్నూలు జిల్లా పాణ్యంలోని తమ్మరాజుపల్లి కొండపై ఓ ముఖ్య నాయకుడి అనుచరులు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ఆ నాయకుడికి భయపడి వాటిని అడ్డుకునే సాహసం అధికారులు చేయట్లేదు.

* గుంటూరు జిల్లా తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో అక్రమ తవ్వకాలతో పంట భూములు దెబ్బతింటున్నాయని రైతులు బాపట్ల తహశీల్దారుకు ఫిర్యాదు చేసినా చర్యలు కొరవడ్డాయి. బాపట్ల, పిట్టలవానిపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలన్నీ ఓ రాష్ట్ర స్థాయి నాయకుడి అనుచరులే నిర్వహిస్తున్నారు.

రాజధానిలోనూ..

రాజధాని అమరావతిలో ఇటీవల కాలంలో రోడ్లను తవ్వేసి అక్కడున్న కంకర తరలించుకుపోయిన ఉదంతాలు వెలుగుచూశాయి. ఇసుక, మట్టి తరలింపు ఘటనలు అనేకం జరిగాయి.

సోదరులు.. కుటుంబ సభ్యులు

* ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ముద్దసానమ్మగండి కొండ, మహమ్మద్‌సాబ్‌ కుంట, వేములకోట, నాయుడుపల్లె చెరువుల్లో రాత్రివేళల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతోంది. స్థానిక నాయకుడి సోదరుడి అండతో మండల స్థాయి నాయకులు ఈ దందా నడిపిస్తున్నారు. కొండెపి నియోజకవర్గంలోని పాలేరు ఒడ్డున, కె.బిట్రగుంట పరిధిలోని ప్రభుత్వ
భూముల్లో తవ్వకాల వెనుక ఓ నాయకుడి కుమారుడు ఉన్నారు.

* కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని రేమల్లె, మల్లవల్లి, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరపల్లిలో పలుచోట్ల ప్రైవేటు భూముల్లో ఓ ముఖ్య నాయకుడి కుమారుడి కనుసన్నల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

* గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో తవ్వకాల వెనుక రాష్ట్ర స్థాయి నాయకుడి సోదరుడి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి.

బినామీలతో అక్రమ దందా

* కాకినాడ ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నాయకుడి ప్రమేయంతోనే పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, అనపర్తి నియోజకవర్గాల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతిచోటా బినామీల్ని ఏర్పాటు చేసుకుని ఈ దందా నడిపిస్తున్నారు.

* నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని నార్త్‌ ఆమలూరు గ్రావెల్‌కు పెట్టింది పేరు. ఓ ముఖ్య నాయకుడి అండతో ఆయన అనుచరులు ఇక్కడ గ్రావెల్‌ మొత్తం తవ్వేశారు.

* పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఓ మండల స్థాయి నాయకుడు, ఆయన మిత్రబృందం మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణాలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

ఇక్కడ పోలవరం కుడి కాలువ గట్టు ఉండేది..

చిత్రాలు చూశారా! ఇళ్ల స్థలాల కోసమో, మైదానం నిర్మాణానికో చదును చేసిన ప్రాంతం అనుకుంటున్నారా? కానే కాదు... నిన్నమొన్నటి వరకూ ఇక్కడ పోలవరం కుడి కాలువ గట్టు చాలా ఎత్తులో ఉండేది. మట్టి, గ్రావెల్‌ కోసం దాన్ని తవ్వేయటంతో అదంతా తరిగిపోయి పక్కనే ఉన్న పంట పొలాలకు సమాంతరంగా మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కంసాలిగుంట సమీపంలో పరిస్థితి ఇది. పోలవరం కుడి కాలువ గట్టు వెంబడి అనేకచోట్ల ఇలాంటి దుస్థితే ఉంది. ఈ గట్టుపై మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అధికారులు తాత్కాలిక అనుమతులను మంజూరు చేశారు. అంతే.. మట్టి మాఫియా చెలరేగిపోయింది. పరిమితికి మించి తవ్వేయడంతోపాటు, అనుమతులు లేనిచోటా గట్టులోని గ్రావెల్‌ను కొట్టేస్తోంది. కృష్ణా జిల్లా నున్న నుంచి పల్లెర్లమూడి వరకూ, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కంసాలిగుంట, నల్లమాడు, గొల్లగూడెం తదితర గ్రామాల పరిధిలో కాలువ గట్టును ఇష్టానుసారం తవ్వేసి భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. దీంతో కాలువకు అనేక చోట్ల గండ్లు పడ్డాయి. చాలా చోట్ల గట్టు బలహీనంగా మారింది.

ఇవీచదవండి.

సీఎం జగన్ నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు

crime news: రాహుల్ హత్య కేసు.. బెంగళూరులో పోలీసులకు చిక్కిన మరో నిందితుడు

tirumala: రేపు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.