హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారి బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. భక్తులు లేకుండా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బోనాల దృష్ట్యా దక్షిణ మండలం ఇంఛార్జ్ డీసీపీ గజరావు భూపాల్.. మహంకాళీ అమ్మవారి దేవాలయ కమిటీతో సమావేశం అయ్యారు. కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
రేపు నిర్వహించే రంగం, బలిగంప, పోతరాజుల గావు కార్యక్రమాలు.. ఆలయ పరిసర ప్రాంతంలో భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని కోరారు. నాగుల చింత నుంచి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పోలీస్‌స్టేషన్ నుంచి.. లాల్‌దర్వాజ, గౌలిపురా.. లాల్‌దర్వాజా రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: