ETV Bharat / city

అంతులేని అక్రమం... హైదరాబాద్ సరిహద్దుల్లో ఆక్రమణల పర్వం - హైదరాబాద్‌ నేర వార్తలు

మహానగరం చిగురుటాకులా వణికిపోయిన రోజది. నాటి వరద బీభత్స గురుతులు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. చిక్కిపోయిన చెరువులన్నీ ప్రవాహాన్ని ఆపలేక జనావాసాల్లోకి విరుచుకుపడటంతో ఎన్ని వేలమంది అగచాట్లు చవిచూశారో తెలిసిందే. అయినా ఇటువంటి తటాకాల్లో నెలకొన్న కబ్జాల తొలగింపుపై యంత్రాంగం ఇప్పటికీ దృష్టిపెట్టలేదు. రాజేంద్రనగర్‌ మండలం గగన్‌పహాడ్‌ వద్ద అప్పాచెరువు దుస్థితి ఇందుకు నిదర్శనం. ఏకంగా ఆరుగురిని బలిగొన్న ఈ తటాకం వద్ద ప్రస్తుత పరిస్థితిపై ‘ఈటీవీ భారత్‌' క్షేత్రస్థాయిలో పరిశీలించి అందిస్తోన్న కథనమిది.

lakes-encroachments-in-hyderabad-city-borders
హైదరాబాద్ సరిహద్దుల్లో ఆక్రమణల పర్వం
author img

By

Published : Dec 26, 2020, 1:56 PM IST

అక్టోబరు 13.. అర్ధరాత్రి 3 గంటల సమయం.. అప్పాచెరువు ఉప్పొంగింది. కాలనీలోకి విరుచుకుపడటంతో ఆరుగురు చనిపోయారు. దీని ఉద్ధృతికి బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. చెరువు హద్దులు గుర్తించి ఆక్రమణలను తొలగించి పరిరక్షించాల్సిన బాధ్యత నీటి పారుదల, రెవెన్యూ అధికారులపై ఉన్నా పట్టించుకోవడం లేదు.

చెరువు నీటిలోనే రోడ్లు..

గగన్‌పహాడ్‌ సర్వే నం.89లో 5.01ఎకరాలు.. 90లో 12.34 ఎకరాలు, 178లో 14.04 ఎకరాలు.. కలిపి 31.39 ఎకరాల్లో అప్పాచెరువు ఉంది. బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకునే ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు పట్టా భూములున్నాయంటూ సాకు చూపి అందినంత ఆక్రమించేసుకున్నారు. ఓ వ్యాపారి చెరువులోనే లే అవుట్‌ వేశాడు. రహదారులు నిర్మించి, ప్లాట్లు వేసి రూ.కోట్లు సంపాదించాడు. రోడ్లు, కొన్ని ఓపెన్‌ప్లాట్లు, షెడ్లు, ఇతర నిర్మాణాలు నేటికీ చెరువు నీటిలో దర్శనమిస్తున్నాయి. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు కట్ట నిర్మించిన ప్రాంతం లోపల ఇది ఉండటం గమనార్హం. అప్పాచెరువు నలుదిక్కులా 24 ఎకరాలు కబ్జాకు గురై ప్రస్తుతం 8 ఎకరాలే మిగిలింది.

హద్దులు నిర్ణయించకుండానే

క్కడ ఎకరా రూ.7-8 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల విలువైన స్థలం స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో చిక్కుకుంది. వర్షాల తర్వాత చెరువు కట్ట పునరుద్ధరించే సమయంలో కబ్జాదారులకు అనుకూలంగా నిర్మాణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించకుండానే కట్ట నిర్మాణం చేపట్టారు. తద్వారా యంత్రాంగమే చెరువు పరిధిని తగ్గించి చూపే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే చెరువు స్థలంలో మట్టి పోసి చదును చేసేందుకు కొందరు ప్రయత్నించారు.

ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు

- కె.చంద్రశేఖర్‌, తహసీల్దార్‌, రాజేంద్రనగర్‌

చెరువులో కొత్తగా కబ్జాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటున్నాం. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు తొలగించాం. అక్కడ వేసిన లేఅవుట్‌, రహదారులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. అలుగు పారే వైపు కాలువ ప్రాంతంలో మట్టి పోసినట్లు ఫిర్యాదులందాయి. నీటిపారుదల శాఖాధికారులు కాలువ హద్దులు గుర్తించి ఇస్తే ఆక్రమణలు తొలగిస్తాం.

రెవెన్యూ సహకారంతో తొలగిస్తాం

- నరేందర్‌, డీఈ, జీహెచ్‌ఎంసీ లేక్స్‌ డివిజన్‌

అప్పాచెరువుకు 2014లోనే హద్దులు గుర్తించాం. రాళ్లు ఏర్పాటు చేస్తుంటే రాత్రికి రాత్రే తొలగిస్తున్నారు. దీంతో జియోట్యాగింగ్‌ చేశాం. పాత కట్ట ప్రకారమే కొత్తగా నిర్మించాం. ఎక్కడా అలైన్‌మెంట్‌ మార్చలేదు. కోర్టు వివాదాల కారణంగా కొన్ని ఆక్రమణలు తొలగించలేకపోతున్నాం. మిగిలినవి రెవెన్యూ అధికారుల సహకారంతో తీసేస్తాం.

ఇదీ చదవండి;

మేయర్​ ఆర్య..! వయసు చిన్నది.. గెలుపు పెద్దది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.