ETV Bharat / city

Rape attempt: ప్రసవానికి వచ్చిన మహిళపై అత్యాచారయత్నం - telangana varthalu

కాసేపట్లో ప్రసవించబోయే నిండు గర్భిణి మీద కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో చేటుచేసుకుంది.

Rape attempt
Rape attempt
author img

By

Published : Jun 20, 2021, 7:10 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ఆసుపత్రిలో పనిచేసే టెక్నీషియన్ అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఈనెల 10న రాత్రి సమయంలో నొప్పులు రావడంతో కోదాడలోని తిరుమల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొవిడ్ పరీక్ష చేయాలంటూ టెక్నీషియన్ శ్రీకాంత్ పరీక్ష గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సదురు మహిళ కేకలు వేయడంతో వెంట వచ్చిన బంధువులు ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్​ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గర్భిణిని ప్రసవం కోసం మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ఆసుపత్రి టెక్నీషియన్​ ఇలా ప్రవర్తించడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుందని మహిళ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో కోదాడ డీఎస్పీ రఘు దర్యాప్తు చేస్తున్నారు..ఈ వ్యవహారంలో నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి కల్పించుకొని కేసును తారుమారు అయ్యే విధంగా చూస్తున్నట్లు సమాచారం. గర్భిణికి న్యాయం చేయాలంటూ మహిళ సంఘాలు కోరుతున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు.

ఇదీ చదవండి: Gang Rape: ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.