దుబ్బాక ఉప ఎన్నికలో అధికార తెరాస ఓటమిపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికలో తమకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆశించిన ఫలితం రాలేదు..
తాము ఆశించినట్లు ఫలితం రాలేదని.. అందరూ గెలుపు కోసమే కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యమని స్పష్టం చేశారు. తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని వివరించారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామన్నారు.
ఇవీ చూడండి : దుబ్బాక ఉప ఎన్నిక పోరు.. జయకేతనం ఎగురవేసిన భాజపా