ETV Bharat / city

KTR: కేటీఆర్‌ చొరవ.. చిన్నారికి పునర్జన్మ - తెలంగాణ వార్తలు

కేటీఆర్ (KTR)​ సార్‌.. నా కుమార్తెకు గొంతు చుట్టూ కణితి ఏర్పడి బాధపడుతోంది.. ఆపరేషన్‌ చేయించే ఆర్థిక పరిస్థితి లేదు.. ఆర్థిక సాయం చేయండి ప్లీజ్‌’’అని ఓ చిన్నారి తండ్రి ట్విట్టర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనికి కేటీఆర్​ స్పందించి.. వారికి సాయం చేస్తానని పేర్కొన్నారు. తాజాగా ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్​ సూచన మేరకు అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు.. శస్త్రచికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు.

ktr help
ktr help
author img

By

Published : Jun 26, 2021, 12:27 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR)​ చొరవతో చిన్నారికి పునర్జన్మ లభించింది. రూ.లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందజేసి అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రి ఉదారత చాటుకుంది. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలంలోని గ్రామానికి చెందిన అవినాష్‌ దంపతులు కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. వీరి కుమార్తె అక్షయ(2)కు మెడపై కణితి వచ్చి ప్రాణాంతకమైందిగా మారింది. తక్షణం తొలగించాలని వైద్యులు తెలిపారు.

ktr help
KTR: కేటీఆర్‌ చొరవ.. చిన్నారికి పునర్జన్మ

శస్త్ర చికిత్సకు రూ.4-6 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బులేని తల్లిదండ్రులు తమ దీన స్థితిని పలువురికి వివరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లింది. ఆయన అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులతో మాట్లాడగా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు. ఆసుపత్రి రోబోటిక్‌ ఆంకో సర్జన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు.

గతంలో హామీ

వింత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య సాయానికి మంత్రి కేటీఆర్​ భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగీతం గ్రామానికి చెందిన సుమలత, అవినాశ్​ల కుమార్తె అక్షయకు గత ఏడాదిగా మెడ చుట్టూ వాపు పెరుగుతోంది. లక్ష రూపాయలు ఖర్చు చేసినా... ఫలితం లేకపోయింది.

సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా... ‘సిస్టిక్‌ హైబ్రోమా’ అనే వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్సకు మూడు లక్షలు ఖర్చవుతుందని చెప్పగా... పాప తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారి వ్యాధి విషయాన్ని గ్రామానికి చెందిన యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

దీనికి స్పందించిన ఆయన.. అక్షయకు శస్త్రచికిత్స చేయించడంతో పాటు పూర్తిగా నయమయ్యే వరకు సహకారం అందిస్తానని రీట్వీట్‌ చేశారు. వెనువెంటనే ఈ నెల 11న సిటిజెన్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాలని మంత్రి కార్యాలయం నుంచి తండ్రి అవినాశ్​కు సూచించింది.

ఇదీ చూడండి:

'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.