ETV Bharat / city

25న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. నీటి కేటాయింపులు, మిగులు జలాల వినియోగంపై చర్చించేందుకు సిద్ధమైంది. జూన్‌ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ నెల 25న సమావేశం జరపనున్నట్లు ప్రకటించింది.

krishna river board management
krishna river board management
author img

By

Published : May 11, 2021, 9:09 AM IST

నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. జూన్‌ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నీటి లభ్యత అంచనా, కేటాయింపులు తదితర అంశాలను సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

కొత్త ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న దృష్ట్యా.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను అందజేయాలని కేంద్రం సూచించింది. ఈ విషయమై బోర్డు కూడా రెండు రాష్ట్రాలకు ఇప్పటికే పలుసార్లు లేఖలు రాసింది. మిగులు జలాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ఏడాదికి పైగా చర్చ జరుగుతోంది. దీనిపై కమిటీని నియమించినా.. సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. బోర్డు ఛైర్మన్‌ పరమేశం ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఇది ఆయన అధ్యక్షతన జరిగే చివరి బోర్డు సమావేశం కానుంది.

ఇదీ చదవండి:

'సైలెంట్ మోడ్​లోకి వెళ్లిన మోదీ, షా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.