కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ.. రేపు (శుక్రవారం) గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో... ఈ గెజిట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. వీటిలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపరిచే అవకాశం ఉంది.
2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నా... అసాధారణంగా ఏడేళ్ల పాటు ఆలస్యమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్ శక్తి మంత్రితో కూడిన అపెక్స్ కమిటీ సమావేశమైనప్పటికీ... తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఇదీ చదవండి:
ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దంటూ..ఏపీ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ