ETV Bharat / city

27 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ - సర్వీసు ప్రారంభం కానున్న కృష్ణా ఎక్స్​ప్రెస్​

తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వరకు నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 27వ తేదీ నుంచి ప్రత్యేక రైలు (నం.07405/07406)గా పట్టాలు ఎక్కనుంది. దాదాపు 10 నెలల విరామం అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

krishna express
27 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌
author img

By

Published : Jan 24, 2021, 12:17 PM IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన కృష్ణా ఎక్స్​ప్రెస్​ తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. దాదాపు 10 నెలల విరామం అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వరకు నడిచే ఈ రైలు... మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ ప్రయాణికులతో పాటు మహారాష్ట్ర వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు తిరుపతి, ఇటు ఆదిలాబాద్‌ నుంచి ఈ రైలు నిత్యం ప్రయాణికులకు అందుబాటులో రానుంది.

ఇప్పటివరకు పండగ ప్రత్యేక రైళ్లుగా నడిపిన మరో నాలుగు జతల రైళ్లను 27, 28, 29 తేదీల నుంచి ప్రత్యేక రైళ్లుగా నడపనుంది. వీటిలో సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లు ప్రయాణికులు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి:

తరువుకొస్తోంది తనువు.. తల్లడిల్లుతోందని 'చిన్నారి' మనువు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.