వచ్చే సంవత్సరం మార్చి వరకు ఎంత మేరకు కృష్ణా నది జలాలు అవసరమో తెలపాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తాజాగా లేఖ రాశారు. జనవరిలో త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8 లోగా కావాల్సిన నీటి వాటాలను పేర్కొనాలని, అదే సమయంలో ఈఏడాది డిసెంబరు వరకు ఎంత మేరకు కృష్ణా జలాలను వినియోగించుకున్నారనే వివరాలు కూడా సమర్పించాలని కోరారు.
ఇదీ చదవండి: వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ